చీకటి వెలుగుల రంగేళి ......


మక్బూల్ వురఫ్ మబ్బుల్ అనే వ్యక్తి కథ .....


  

మీలో చాల మంది పిల్ల జమిందార్ సినిమా చూసే వుంటారు ..... 

అందులో తాగుబోతు రమేష్ ఉంటాడు.....  గుర్తుందా ? ఆ .... ! అయితే మీరు నా ట్రాక్ లో వునట్టే .... 

వాడు అమెరికాలో ఉండి వెనక్కి వస్తాడు  ఇండియా ..... నిద్దర టైమ్స్ సెట్ కాక .... 

పగలు పడుకుంటూ ఉంటాడు వీణ్ణి  రాత్రి పరిచయం చేస్తాలే అంటాడు .... అతని ఫ్రెండ్ ..... 

ఇప్పుడు చెప్పే కథ కూడా అలాంటిదే .... 
==========================================


ఇంతకు ముందు చెప్పినట్టు గానే .... ఆ విధం గా బెంగుళూరు వచ్చి పడ్డాక ఏం జరిగిందంటే ...... 

నా అదృష్టం లెఫ్ట్ లెగ్ తో తన్నడం వల్ల  ..... వెళ్లి యు. ఎస్.  ప్రాజెక్ట్ లో పడ్డాను ..... 

పడగానే మొదట భయం ... వాళ్ళ తో మాట్లాడటం ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉంటుందేమో అని ..... 

కాని మెల్లి గా అనిపించింది రోజూ ఆఫీసు కి వెళ్తుంటే ....... అదేం  పెద్ద కష్టం కాదు అని ..... 

కాకపోతే జీవితం లో కొత్త కష్టాలు అప్పుడే మొదలయ్యాయ్ ..... ఆ సంగతి నాకు ఎప్పుడు తెలిసిందంటే ..... 

ఆఫీసు లో జాయిన్ అయ్యాక మొదటి వారం వీక్ ఆఫ్ రోజు ..... 

నా షిఫ్ట్ 6:00 PM (IST) టు 3:30 AM (IST) .... ఈ IST మరియు CST దరిద్రం కూడా మా ఆఫీసు వాళ్లు అన్టించిందే .... 

ఇక మొదటి వారం సెలవు రోజు రూం మేట్స్  అందరు 11 గంటలకి పడుకుందాం అని సిద్దం అయ్యారు ..... 

సరే బానే వుంది నేను కూడా ఒక రెండు గంటలు .... ఆరెంజ్ సినిమాలో బ్రంహనందం  లా బానే పడుకున్నాను ..... 

కాని మధ్యలో మెలుకువ వచ్చినప్పుడే మొదలయ్యాయ్ నా కష్టాలు .... 

మళ్ళి నిద్ర చస్తే పట్టి చావదు .... ఎంత సేపు తన్నుకున్నా .... ఎన్ని ఆసనాల్లో పడుకుందాం  అన్నా నిద్ర రాదే .... 

ఇక లాభం లేదు లాప్ టాప్ ఆన్ చేశా .... ముఖం పుస్తకం .... ఈనాడు వార్త పత్రిక .... (You Tube అర్ధం తెలుగు లో మీరే తెలుసుకోండి .... ;) ) దాదాపు గా మొదటి నుంచి చివరి దాక పీల్చి పిప్పి చేసినా .... నిద్ర రాదే .... 

అలా అలా మొదట కోళ్ళు ... తర్వాత వాటిని తినే జనాలు నిద్ర లేవటం మొదలు పెట్టారు .... 


నాకు మాత్రం నిద్ర రావటం లా ... అలా తెల్లారి ఏడు అయ్యింది .... అప్పటికే అందరు నిద్ర లేచేసారు ... 


అప్పుడు నాలోని నిద్ర దేవుడు నిద్ర లేచి నన్ను నిద్ర లోకి లాగుతున్నాడు ... 


సరే రాత్రి పడుకోలేదు కదా అందుకే నిద్ర వస్తోంది అనుకోని .... నిద్ర కి ఉపక్రమించా .... 


కాని మళ్ళి ఆ తర్వాత వారం .......  దాని తర్వాత వారం అదే పరిస్థితి ..... అప్పుడు అర్ధం అయ్యింది నాకు ..... 

నా జీవిత చక్రం మొత్తం మారిపోయింది అని .... మనం మధ్యానం కాసేపు పడుకున్నట్టు నాకు వాళ్ళ టైం ప్రకారం నిద్ర పడుతోంది కాసేపు ...  

మన తెల్లారి వాళ్ళ రాత్రి .... ఆ టైం లో నాకు నిద్ర వస్తోంది ... ఇక చూడండి నా పరిస్థితి ..... 

పొద్దున్న పూట తిండి లేదు .... రాత్రి పూట నిద్ర లేదు .... అది జీవితం మొత్తం .... తలకిందులయింది ..... 

సరే టైం మన 8 AM  అయ్యింది .... నాకు నిద్ర వస్తోంది ఉంటా .... :) :)

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......